![]() |
![]() |
.webp)
తనకు ఎవరూ లవ్ లెటర్ రాయడం లేదని తెగ ఫీలైపోతోంది దివి. ఈమె రీసెంట్ గా "లంబసింగి" మూవీలో నటించింది. ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూకి వచ్చింది. అక్కడ తన బాధనంతా వెళ్లగక్కింది. "ఎవరైనా లెటర్ రాసిస్తే బాగుండు అనుకుంటా. ఎవడైనా కొంచెం పెన్ను, పేపర్ పెట్టి కష్టపడి ఓ కవితో, నాకు నువ్వంటే ఇష్టమనో రాసిస్తారేమో అని ఎప్పటినుంచో అనుకుంటున్నా..అలా ఎప్పుడూ ఎవరూ రాసివ్వలేదు" అని బాధపడిపోయింది.
"ఇక సినిమా ఆఫర్స్ వస్తాయని అనుకోలేదు..కొంతమంది సన్నగా ఉన్నానని, కొంతమంది లావుగా ఉన్నానని రిజెక్ట్ చేశారు. రవితేజ గారి పక్కన నేను లీడ్ రోల్ చేయాల్సింది కానీ రాత్రికి రాత్రే క్యారెక్టర్ ని మార్చేశారు. నేను ఇంత సిన్సియర్ గా లవ్ చేస్తున్నానంటే అతను ఎంత బాగా చూసుకుని ఉంటాడు నన్ను... హి ఈజ్ ది బెస్ట్..ఎన్నో ఆడిషన్స్ కి వెళ్లాను, ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను.. ఇంటికి వచ్చాక ఫోన్ రాదు. నేను బాలేనా, నాలో ఏమన్నా ఫాల్ట్ ఉందా, నా యాక్టింగ్ బాలేదా ఏదీ చెప్పరు.. ఎవరికీ తెలీకుండా ఎన్ని సార్లు ఏడ్చానో గుర్తొస్తే ఏడుపొస్తుంది.
నేను ఒక ఫోక్ సాంగ్ చేసాను.. కామెంట్స్ అన్నీ నెగటివ్ గానే ఉన్నాయి. నీకు డాన్స్ వచ్చా, ఏంటి ఇలా ఉన్నాయి, నీ డాన్స్ ఇలా ఉంది అంటూ తిట్టినవాళ్ళే ఎక్కువగా ఉన్నారు.. ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా లేదు అందులో...మా పేరెంట్స్ కి తెలిస్తే రివర్స్ లో నన్ను తిడతారేమో అని నేను వాళ్లకు ఏమీ చెప్పలేదు" అని దివి ఆ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పి బాధపడింది. గాడ్ ఫాదర్ మూవీలో కనిపించిన దివికి ఆ తర్వాత పెద్దగా మూవీ ఆఫర్స్ రాలేదు. బిగ్ బాస్ తెలుగు 4 లో కంటెస్టెంట్ గా వెళ్లి బాగా పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీతో కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లో నటించింది. అయితే ఏదీ ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. మరి లంబసింగి మూవీ అన్నా ఆమెకు బ్రేక్ ఇస్తుందా లేదా చూడాలి.
![]() |
![]() |